Monday, November 11, 2013

అబ్బా! సినిమాలు సమాజాన్ని మార్చేస్తాయా?

 హలో... ఒక్క నిముషం...

సినిమాలు సమాజాన్ని మార్చేస్తాయా ?

కాదేమో. ఇప్పుడూ... చిన్నప్పటినుంచి సినిమాల్లో విలన్ లు చెడ్డవాళ్ళని, తెగ తన్నులు
తిని, లాస్ట్ కి చస్తున్టారని  చూపిస్తున్నారు. మరి సమాజంలో విల్లైన్లు లేరా? సుబ్బరంగా ఉన్నారు. సినిమాల్లో వ్యాంపులు బుల్లి బుచ్చి బట్టలేసుకుని డాన్సులు చేసేస్తారు. మన కాలనీలో ఎంత మంది అలా కనిపిస్తున్నారో లెక్క పెట్టండి. ప్చ్ సున్నా... కదా....

ఓహో సినిమాల్లో విప్లవాలు వోచ్చేసినట్టు చూపిస్తుంటారు. గవర్నమెంటులు కూల్చేసిన తిరుగుబాట్లు కనిపిస్తుంటాయి. వందేళ్ళ సినిమా చరిత్రలో, సినిమాలు చూసి ఎన్ని తిరుగుబాట్లు అయ్యయమ్మ? నాకు తెలిసి ఒక్కటీ లేదు. అన్యాయానికి తిరగబడి రోడ్ మీద రౌడీలని చితక బాదేస్తాడు వీరో. నాకైతే అలా ఎవ్వరూ ఇప్పటివరకు తగల్లెదండి. మీరేమన్న చూసారా? అంత ఎందుకండి, సినిమాల్లో, తోటమాలి రాము కాకా చుట్ట కాల్చినా, "పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం" అని స్టిక్కర్లు వేసి ఊదర కొట్టి పారేస్తున్నారు కదా, అది చూసి సిగరెట్లతో సిగపట్లు ఎవరైనా మానేసిన దాఖలాలు ఉన్నాయా? (అబ్బ ప్రాస అద్దిరింది) ...

అంటే? సినిమా కి సమాజం మీద ప్రభావం లేదా? అని ఇప్పుడు మీరు అడగాలి. అడిగారా?... ఓకే.

ఏంటండి అలా అంటారు? ఎందుకు లేదు? ఉంది. త్రివిక్రమ్ గారి సినిమాల్లో డయలాగులు విని మనం ఆఫీసుల్లో
ఇళ్ళల్లో వాదేస్కోవట్లేదేటి? ఆరోజుల్లో జంధ్యాల గారి మాటలు, ప్రేమలో పడ్డప్పుడు సినిమా కవి పాటలు, వాడేసుకోవట్లేదూ? నీ ఎంకమ్మ అనేస్కుంటాం వాడుకలో, అది బ్రాహ్మి, "చిత్రం భళారే విచిత్రం" సినిమా లో వాడిన ఊత పదం కదూ? అంతే కాదు. యూత్ అనుకరించే హీరో హెయిర్ స్టైల్, బట్టలు, హీరోయిన్ హొయలు, టీనేజ్ పిల్లల చేసే ఊహలు, కనే కలలు అన్నీసినిమాల్లో నుంచి వొచ్చినవే కదా?

ఆ! అర్ధం అయింది. రెండు వైపులా వీడే మాట్లాడుతున్నాడు, అసలు ఇంతకి వీడి ఉద్దేశం ఏంటి? అని మీ థింకింగ్. చెప్తా. మన కల్చర్ కి, పెంపకానికి, జీన్స్ కి  వ్యతిరేకంగా ఉన్నవి అంత తొందరగా ఎక్కేసి మార్పులు రావడం జరగదు. సినిమాలు చూసి మార్పు వొస్తుంది. కానీ, మెల్లిగా, అంతర్గతంగా. చాప కింద చీమల దండులా...

సినిమా, ముందు ఒక ఆలోచనని పుట్టిస్తుంది. ఆ ఆలోచనని సమర్ధించే అనుభవం ఎదురైతే, అది నమ్మకంగా మారుతుంది. మన నమ్మకాలు మన ప్రవర్తన కి కారణం అవుతాయి. మనలో ఆ ప్రవర్తనా సరళి అంతరాల్లో దాగి ఉంటుంది. ఎప్పుడైతే తగ్గ పరిస్తితి ఏర్పడుతుందో, ఆ ప్రవర్తన బహిర్గతం అవుతుంది. ఈ ప్రవర్తన వేళ్ళు ఎక్కడున్నాయి? ఆనాడు ఎప్పుడో చూసిన సినిమా సీన్ లో ఉన్నాయి. కనుక, సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సినిమా -> ఆలోచన -> అనుభవం ->
నమ్మకం -> ప్రవర్తన. అది స్టొరీ. .

ఏంటి? బాగా చెప్పానా? అయ్యో... మీ అభిమానం... :)